27-02-2025 03:54:16 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జిల్లా పరిషత్ హైస్కూల్లో గురువారం నిర్వహించిన పట్టభద్రుల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ కమిషన్ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రులు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల అధికారులు కేంద్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లకు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.