28-04-2025 10:12:43 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఐటిసి పిఎస్పిడి ఐఎన్టియుసి యూనియన్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి సభ్యులు యారం పిచ్చిరెడ్డి తెలంగాణ రాష్ట్ర కనీస వేతనల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ తో సోమవారం హైదరాబాద్ లో సమావేశమై అనంతరం, జనక్ ప్రసాద్ తో కలసి నూతనంగా కమిషనర్, లేబర్, డైరెక్టర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, డైరెక్టర్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్‌గా నియమితులైన దాన కిషోర్ ని మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతన సలహా మండలి సభ్యులు నరసింహ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజు ముదిరాజు తదితరులు పాల్గొన్నారు.