03-04-2025 12:00:00 AM
కరీంనగర్, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): నగరంలోని కమాన్ వద్ద గల పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నూతన ధర్మకర్తల మండలి సభ్యులు బుధవారం కరీంనగర్ ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం ఈనెల 6 న నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ధర్మకర్తల మండలిని ఎమ్మెల్యే గంగుల అభినందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. మాజీ కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముత్తోజు రామ్ కుమార్, ధర్మకర్తలు వెంగళం రామకృష్ణ, ఏదులాపురం మహేష్, గోగులకొండ నరసింహ చారి, వంగల నవీన్, గోగులకొండ కరుణాకర్, వెగ్గలం రామకృష్ణ, గోకుల కొండ నరసింహ చారి, తదితరులు పాల్గొన్నారు.