ప్రారంభోత్సవానికి సన్నాహాలు
పారదర్శకంగా మోడల్ మార్కెట్ షాపులు కేటాయింపు
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న మోడల్ మార్కెట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండు వారాలలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సన్నహాలు చేస్తున్నట్టు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు మంగళవారం తెలిపారు. అందులో భాగంగానే మోడల్ మార్కెట్ ను ఇల్లందు పాలకవర్గం సభ్యులు పరిశీలించారు. షాపుల కేటాయింపులో పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో డి ఈ మురళి, ఏవో శ్రీనివాస్ రెడ్డి, 24 వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.