08-04-2025 12:01:08 AM
భద్రాచలం, ఏప్రిల్ 7(విజయక్రాంతి)తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు జిష్ణుదేవ్ వర్మ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి పట్టాభిషే కానికి విచ్చేసిన సందర్భంగా వారిని భద్రాచలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రా చలం శాఖ వారు కలిసి శాలువాతో సన్మానించి మెమోంటోను అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన ,పేద మారుమూల ప్రజల సంక్షేమం కొరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం శాఖ వారు ఉచిత కంటి శస్త్ర చికిత్సా శిబిరము 2024, నవంబర్ 6 నుంచి 2025, ఫిబ్రవరి15 వరకు వరకు నిర్వహించి 168 గ్రామాల్లో, 12 మండలాల్లో 1075 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించామని వివరించారు.
ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పూర్తి సహకారంతో కంటి చూపు అందించడం జరిగిందని జిల్లా కోఆర్డినేటర్ డా.ఎస్.ఎల్.కాంతారావు తెలిపారు., గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం శాఖ వారి సేవలను అభినందించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ డా.ఎస్.ఎల్.కాంతారావు, వి.శ్రీనివాసరావు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంజర్, వై. సూర్యనారాయణ స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్, జి.రాజారెడ్డి, ట్రెజరర్, శ్రీ గాలీబ్ (కొత్తగూడెం శాఖ వారు), జి.సంజీవరావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.