కామారెడ్డి (విజయక్రాంతి): ప్రాంతీయ రవాణా శాఖ కమిటీ మెంబర్ గా నియమితులైన ఎజాజ్ ఖాన్ గురువారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(District Collector Ashish Sangwan) ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకే అందజేసి సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రాంతీయ రవాణా శాఖ కమిటీ సభ్యునిగా ఏజాజును నియమించి, ఉత్తర్వులను కలెక్టర్కు అందజేశారు. ఆయనతో పాటు కామారెడ్డి జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డితో పాటు రవాణాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.