calender_icon.png 23 January, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రికల్చర్ యూనివర్సిటీని సందర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు

23-01-2025 06:38:37 PM

రాజేంద్రనగర్: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఉదయం అగ్రిహబ్ వద్దకు చేరుకున్న హుస్సేన్ కి ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. తర్వాత హుస్సేన్ నాయక్ రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో ఎస్టీ ఉద్యోగులు, విద్యార్థులతో సమావేశమయ్యారు. వారి వినతుల్ని, విజ్ఞప్తుల్ని తీసుకున్నారు. తర్వాత హుస్సేన్ నాయక్ ఉపకులపతి ఆల్దాస్ జానయ్య, రిజిస్ట్రార్ డి. శివాజీ, ఇతర విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. తన దృష్టికి వచ్చిన అనేక విషయాల గురించి వివరించారు.

వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. తాను ఈ మధ్యనే విశ్వవిద్యాలయం ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టానని ఆల్దాస్ జానయ్య వివరించారు. అలాగే తాను ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ మూడు నెలలో విశ్వవిద్యాలయంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. తాను ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టాక ఎస్టీ కమిషన్ సభ్యులు విశ్వవిద్యాలయాన్ని సందర్శించడం సంతోషదాయకమన్నారు. ఈ మధ్యనే విశ్వవిద్యాలయం వజ్రోత్సవ ఉత్సవాల్ని కూడా ఘనంగా నిర్వహించామన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల అంశాల్ని దశలవారీగా పరిష్కరించడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు జానయ్య వివరించారు.