హైదరాబాద్: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. రెండు రోజు ల క్రితం స్వల్పంగా తగ్గిన పసిడి రేటు సోమవారం అంతే స్థాయిలో పుంజుకున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,500 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,000 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.150, రూ.160 చొప్పున పెరిగాయి.
ఇక దేశ రాజధాని delhiలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.150 పెరిగి రూ.71,650 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.160 ఎగిసి రూ.78,150 వద్దకు చేరాయి. Chennai, Bangalore, Mumbai ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.150, 24 క్యారెట్ల బంగారం రూ.160 పెరిగాయి.
వీటి ధరలు ప్రస్తుతం రూ.71,500, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.78,000గా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ప్రస్తు తం హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.99,900 వద్ద, ఢిల్లీలో రూ.92,400 వద్ద ఉన్నాయి.