calender_icon.png 24 October, 2024 | 2:51 PM

రామ్‌చరణ్‌కు మెల్‌బోర్న్ అవార్డు

20-07-2024 02:47:17 AM

గ్లోబల్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదిం చుకున్న స్టార్ హీరో రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. మెల్ బోర్న్ వేదికగా జరుగనున్న ‘ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బో ర్న్’ (ఐఎఫ్‌ఎఫ్‌ఎం)15వ ఎడిషన్‌కు ఆయన గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన సేవకు గాను ఆయన ఇదే వేదికపై ‘ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్’గా పురస్కారం అందుకోనున్నారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే అధికారిక చలన చిత్రోత్సవమే ఐఎఫ్‌ఎఫ్‌ఎం. ఈ వేడుకలు ఆగస్టు 15న ప్రారంభమై అదే నెల 25వ తేదీ వరకు జరగనున్నాయి.

అయితే, అరుదైన గుర్తింపును అందుకోనున్న విషయాన్ని నిర్వాహకులు ప్రకటించిన సందర్భంపై చరణ్ స్పందించారు. ఈ గౌరవం అందుకోవటంపై హర్షం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. “మన భారతీయ చిత్రాల్లో వైవిధ్యాన్ని, గొప్పదనాన్ని అంతర్జాతీయ వేదికగా వేడుక నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్’లో భాగం కావడమనేది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.

ఈ వేదికపై మన చిత్ర పరిశ్రమ తరఫున నేను ప్రాతినిధ్యం వహించనుండటం ఆనందంగా ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులతో సంబంధం ఏర్ప తుండటం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఘన విజ యాన్ని అందుకుంది. ఆ సినిమాను ఆదరించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. మెల్‌బోర్న్‌లో మన జాతీయ జెండాను ఎగురవేసే అద్భుతమైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నా” చరణ్ అన్నారు.