calender_icon.png 29 October, 2024 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఈఐఎల్‌కు రూ.12,800 కోట్ల అణు విద్యుత్ ప్రాజెక్టు ఆర్డరు

27-06-2024 01:25:30 AM

హైదరాబాద్, జూన్ 26: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ కంపెనీ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్)కు భారీ ఆర్డరు లభించింది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐఎల్) నుంచి అణు విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన రూ. 12,800 కోట్ల విలువైన ఆర్డరును పొందినట్టు ఎంఈఐఎల్ బుధవారం వెల్లడించింది. కర్నాటకలోని కైగాలో రెండు 700 మెగావాట్ల ఎలక్ట్రికల్ రియాక్టర్ల నిర్మాణానికి ఈ ఆర్డరు లభించిందని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు 2023 అక్టోబర్ టెక్నికల్ బిడ్స్ జరగ్గా, ఎంఈఐఎల్‌తో బీహెచ్‌ఈఎల్, ఎల్ అండ్ టీలు పోటీపడ్డాయి. రూ.12,799.92 కోట్లకు తాము సమర్పించిన లోయస్ట్ బిడ్, కనపర్చిన సాంకేతిక సామర్థ్యం కారణంగా ప్రాజెక్టు చేజిక్కించుకున్నట్టు ఎంఈఐఎల్ డైరెక్టర్ సిహెచ్ సుబ్బయ్య తెలిపారు.