calender_icon.png 1 April, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్తాపూర్‎లో మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య

29-03-2025 01:21:56 PM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం(Rajendranagar Mandal)లో శనివారం విషాదం చోటుచేసుకుంది. అత్తాపూర్(Attapur)లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. చున్నీతో ఉరేసుకొని మెహందీ ఆర్టిస్ట్(Mehndi Artist) పింకీ ప్రాణాలు తీసుకుంది. ఏడాది క్రితం అమిష్ లోయా అనే వ్యక్తితో పింకీ వివాహం జరిగింది. కుటుంబకలహాలతోనే(family strife) పింకీ బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పింకీ ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.