calender_icon.png 18 October, 2024 | 3:33 AM

మహారాష్ట్రతో మేఘా ఒప్పందం

27-09-2024 12:00:00 AM

21 వేల కోట్లతో రెండు పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): మహారాష్ట్రలో  21 వేల కోట్ల పెట్టుబడితో 4 వేల మెగావాట్ల సామ ర్ధ్యం కలిగిన రెండు భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈ ఐఎల్) గురువారం ఒప్పందం చేసుకుంది. ఒప్పందం పై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో  జల వనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి దీపక్ కపూర్, మేఘా ఇన్‌ఫ్రా ప్రెసిడెంట్ ఆర్ వి ఆర్  కిషోర్ సంతకాలు చేశారు. మేఘా ‘బిల్డ్-ఓన్-మెయింటెనెన్స్ (బిఓఎం) విధానంలో  నిర్మిస్తున్న తోలి ప్రాజెక్టులు ఇవి.