calender_icon.png 28 January, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగాస్టార్ వల్ల నా ఫిట్‌నెస్ చెడిపోతోంది

15-08-2024 12:00:00 AM

ఆతిథ్యం ఇవ్వటంలో తెలుగువారి తర్వాతే ఎవరైనా. సినీ పరిశ్రమలోనూ అతిథి మర్యాదలతో ఆనందపరిచే వారికీ కొదువ లేదు. హీరోల విషయానికొస్తే మొదట వినిపించే పేరు ప్రభాస్. ఓ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నప్పుడు మూవీటీమ్‌కు ఇంటి భోజనం తెప్పి స్తారు. ఇందుకు ప్రత్యేకంగా చెఫ్స్‌ను నియ మించుకున్నారట ప్రభాస్. వారు తయారు చేసిన భోజనాన్ని ప్రతిరోజూ ప్రభాస్ హీరోయిన్లకు, యూనిట్ సభ్యులకు వడ్డిస్తారని చెప్తారు. ఈమధ్య ఎన్టీఆర్ కూడా అలాగే చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ‘దేవర’ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ మర్యాదల గురించి సామాజిక మాధ్యమంలో చెప్పుకొచ్చింది.

తాను రాసిన పోస్టుకు ఎన్టీఆర్ పంపిన భోజనాల ఫొటోలను సైతం ట్యాగ్ చేసింది. తాజాగా, చిరంజీవి ఆతిథ్యం ఎలా ఉంటుందో కూడా వెల్లడించింది త్రిష కృష్ణన్. ఆమె ప్రస్తుతం మెగాస్టార్ సరసన ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం కొనసా గుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో త్రిషకు సంబంధించిన సన్నివేశాలనే చిత్రీకరిస్తున్నారు. అయితే, ఆమె కోసం చిరంజీవి ప్రత్యేకంగా ఇంటి నుంచి భోజనం పంపిస్తున్నారట. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది త్రిష. చిరంజీవి తనను చంపేస్తున్నారని తెలిపింది. ‘ప్రతిరోజూ మెగాస్టార్ భోజన మర్యాదల వల్ల చెడిపోతున్నా’ అంటూ పోస్ట్‌లో రాసింది. ఆ వంటకాలన్నీ ఆరగించి తన ఫిట్‌నెస్‌ను కోల్పోవాల్సి వస్తోందన్న అర్థంలో ఈ వ్యాఖ్యల్ని సరదాగా రాసింది త్రిష కృష్ణన్.