calender_icon.png 3 April, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదొక ఎడ్యుకేటివ్ ‘కోర్ట్’ డ్రామా: చిరంజీవి

31-03-2025 10:12:17 PM

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు రామ్‌జగదీష్ దర్శకత్వం వహించగా, ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మార్చి 14న విడుదలైన ఈ చిత్రం యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రబృందాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. నటీనటులు, దర్శకుడిని ఇంటికి పిలిచి సత్కరించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. 'కోర్ట్’ అందరూ గర్వపడే సినిమా. సినిమా చూశాను. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. కథను ఆద్యంతం చాలా టైట్ తీసుకుంటూ వెళ్లారు. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. ప్రతి పాత్ర సహజంగా ఉంది. దీన్ని కేవలం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్‌లా కాకుండా ఒక ఎడ్యుకేటివ్ కోర్టు డ్రామాగా భావిస్తున్నా. సినిమాలో చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. నాని ఒక కథపై ఆసక్తి చూపించారంటే కచ్చితంగా అందులో విషయం ఉంటుంది. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి డ్రైవింగ్ ఫోర్స్‌గా నాని పనిచేశారని భావిస్తున్నా. సినిమా యూనిట్ అందరికీ అభినందనలు’ అన్నారు.