calender_icon.png 28 April, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువ హీరోకు మెగా ఆఫర్!

25-04-2025 12:00:00 AM

చిరంజీవి హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ సినిమాకు కొబ్బరికాయ కొట్టేసిన సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ‘మెగా157’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్టును హ్యుమర్ అండ్ హై ఎనర్జీతో కూడిన యాక్షన్ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిసున్న దర్శకు డు..

చిరంజీవి పాత్రకు ఆయన అసలు పేరు శంకర్ వరప్రసాద్‌నే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 2026 సంక్రాంతి బరిలో నిలువ నున్న ఈ ప్రాజెక్టుకు పూజ చేసింది మొదలు.. డైరెక్టర్ అనిల్ ప్రచార కార్యక్రమాలకు తెరతీశాడు. ఓ ప్రమోషనల్ వీడియోతో సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించాడు. దీంతో ఈ మూవీకి సంబంధించి అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తారన్న ఆసక్తి సహజంగానే అందరిలో నెలకొంది.

ఇదిలా ఉండగా, ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త వినవస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవిని ఢీకొట్టే ప్రతినాయక పాత్రను అనిల్ రావిపూడి పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడని, ఈ పాత్రలో నటించేందుకు యంగ్ హీరో కార్తికేయ అయితేనే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందనేది ఆ వార్తల సారాంశం. ఈ ప్రచారం నేపథ్యం లో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

‘ఆర్‌ఎక్స్100’తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ.. ఒకట్రెండు సినిమాల్లో విలన్‌గానూ సత్తా చాటాడు. తాజాగా వచ్చిన మెగా ఆఫర్‌ను అందుకుంటే మాత్రం అటు సినిమా, ఇటు ఆయన కెరీర్ మరో లెవెల్ అనేది ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ కూడళ్లలో నడుస్తున్న టాక్.