calender_icon.png 1 March, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచంలో యువశక్తి కలిగిన దేశం భారతదేశం: ఎంపీ ఈటెల రాజేందర్

01-03-2025 06:04:18 PM

కూకట్ పల్లి,(విజయక్రాంతి): ప్రపంచంలో అత్యధిక మన్ పవర్ కలిగిన దేశం మన భారతదేశం అని మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్(Malkajgiri MP Etela Rajender) అన్నారు. శనివారం సేవాభారత్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి జెఎన్టియుహెచ్(Kukatpally JNTUH) లో నిర్వహించిన మెగా జాబ్ మేళా(Mega Job Mela)ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ... యూరప్, చైనా, అమెరికా కంటే కూడా యువ శక్తి కలిగిన దేశం. గతంలో అనేక ప్రభుత్వాలు పథకాలను ప్రకటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు అందడం లేదని దూర దృష్టితో విద్యార్థుల ఉద్యోగ కల్పన కోసం మొట్ట మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో  4 లక్షల కోట్ల రూపాయల నో కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్(Skill Development Center) ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రతగా ఉంది అమెరికా వంటి దేశాలు ఎలాంటి ఆంక్షలు పెడుతున్నాయో ఇతర దేశాలలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తరచూ చూస్తూనే ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా పేరుతో ఉద్యోగ కల్పన కల్పిస్తూ యువత సొంత కాళ్ళ మీద  నిలబడేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారని అన్నారు. సేవాభారత్ ఆధ్వర్యంలో 20 వేల మంది విద్యార్థులకు ఉద్యోగ కల్పన కోసం 160 కంపెనీలు పిలిపించి మెగా జాబ్ మేళాను నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ప్రతి ఇంటికి సర్వే చేసి నిరుద్యోగుల సమగ్ర నివేదిక తయారు చేసుకొని మూడు సంవత్సరాలలో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మల్కాజ్గిరి, హుజురాబాద్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో నిరుద్యోగులు లేకుండా చేస్తాను అని తెలిపారు.