22-04-2025 02:05:19 AM
ప్రముఖ సామాజికవేత్త
సిద్దు రెడ్డి కందకట్ల విజ్ఞప్తి
రాజేంద్రనగర్ ఏప్రిల్21: మెగా జాబ్ ఫెయిర్ ను సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ సామాజికవేత్త సిద్దు రెడ్డి కందకట్ల విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ఒక ప్రకటన లో వివరాలు వెల్లడించారు. బుధవారం శంషాబాద్ పట్టణంలోని ఎయిర్పోర్ట్ రోడ్డులో ఉన్న రాజ్ మహల్ ఫంక్షన్ హాల్ లో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఆయన పేర్కొన్నారు. అమెజాన్, జిఎంఆర్ తదితర పెద్ద కంపెనీలు పాల్గొంటాయని వివరించారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు తెలియజేశారు.
21 వేలకు పైగా ఉద్యోగాలు అందుబాటులోఉన్నాయన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సామాజికవేత్త సిద్దు రెడ్డి కందకట్ల విజ్ఞప్తి చేశారు.