calender_icon.png 3 April, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు మెగా జాబ్ మేళా

01-04-2025 02:35:35 AM

నాగర్‌కర్నూల్ మార్చి 31 (విజయక్రాంతి) నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 2న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎం. అంజయ్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరుగుతుందని, అనేక ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొననున్నట్లు తెలిపారు. బీటెక్, డిగ్రీ లేదా పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ స్టడీ సర్టిఫికెట్ల జిరాక్స్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాల్సి ఉంటుందని తెలియజేశారు. ఏప్రిల్ 2న ఉదయం 10 గంటలకు మేళా ప్రారంభమవుతుందని, నిరుద్యోగులు తప్పకుండా పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ జాబ్ మేళాలో హెటిరో, మెడ్ ప్లస్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి అనేక కంపెనీలు పాల్గొననున్నాయి. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ ఎం. అంజయ్య సూచించారు.