calender_icon.png 26 February, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

26-02-2025 12:00:00 AM

ఖమ్మం, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : స్థానిక ఎస్.ఆర్ బి.జి ఎన్.ఆర్ కళాశాల ప్లేస్ మెంట్స్ సెల్ -తెలంగాణ స్కిల్స్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో మేజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో మంగళవారం  నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పంద న లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా తెలిపారు.

మొత్తం 426 మంది హాజరు కాగా,198 మంది ,8 కంపెనీలకు ఎంపికయ్యారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్లేస్ మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ చింతా సుధాకర్, టీ.ఎస్.కే.సి కోఆర్డినేటర్ మాధవి, మెంటార్  వేలాద్రి, మేజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు, ప్లేస్ మెంట్ ఆఫీసర్ రమేష్, వెంకన్న, తిరుపతి, వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.