calender_icon.png 1 March, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పగిడేరులో మెగా హెల్త్ క్యాంపు

01-03-2025 01:06:54 AM

సందర్శించిన ఐటీడీఏ పీవో రాహుల్..

మణుగూరు, ఫిబ్రవరి 28(విజయ క్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పగిడేరు గ్రామంలో శుక్రవారం ITౄA సహకారంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. వైద్య శిబిరాన్ని ITౄA PO రాహుల్ సందర్శించారు. శిబిరంలో అందిస్తున్న సేవలను పరిశీలించారు. వైద్యానికి విచ్చేసిన ప్రజలతో మాట్లాడారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్ లు జనరల్ మెడిసిన్, ఎముకల, చెవి, ముక్కు, గొంతు, పిల్లల, స్త్రీ వ్యాది నిపుణులు, కంటి వ్యాది, నిపులు వైద్య చికిత్సలు అందించారు.

అన్ని రకాల రక్త పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. సుమారు 83 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 22 మందికి కటరాక్ట్ అవసరం ఉన్నట్లు గుర్తించారు. నిక్షయ్ షివిర్ లో 46 మందికి X- రే పరీక్షలు చేశారు. శిబిరంలో సుమారు 524 మందికి పైగా సద్వివినియోగించు కున్నారు. కార్యక్రమంలో ౄM & HO డాక్టర్ భాస్కర్ నాయక్, ౄIO డాక్టర్ బాలాజీ నాయక్, డాక్టర్ నిశాంత్ రావు, వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది, పంచాయతీ, డెవలప్మెంట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.