రాజేంద్రనగర్: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ సహకారంతో ఎయిర్పోర్టులో మెగా ఐ కేర్ క్యాంప్ నిర్వహించారు. ఈ ప్రత్యేక చొరవతో డ్రైవర్లతో పాటు వివిధ ఏజెన్సీలకు అనుబంధంగా ఉన్న వారితో పాటు స్వతంత్ర ఆపరేటర్లకు, విమానాశ్రయ పర్యావరణ వ్యవస్థలోని కార్మికులకు ప్రత్యేకంగా సేవలందించారు. ఈ శిబిరంలో ఉచిత కంటి పరీక్షలు, కళ్లద్దాలు, కీలక ఆరోగ్య విద్యను అందించారు. భద్రతను ప్రోత్సహించడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ద్వారా జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తన శ్రామిక శక్తి శ్రేయస్సు పట్ల నిబద్ధతను తెలియజేస్తున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి.