calender_icon.png 23 January, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా డీఎస్సీ నిర్వహించాలి

03-07-2024 12:59:57 AM

టీజీపీఎస్సీ ఎదుట ఏబీవీపీ ఆందోళన

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింత కాయల ఝాన్సీ డిమాండ్ చేశారు. మంగళ వారం సంఘం నాయకులతో కలిసి ఆమె నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయ ముట్ట కి యత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరస న తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్‌లో పోస్టులను పెంచి మెగా డీఎస్సీ ఇవ్వాలని కోరారు. అలాగే గ్రూప్ 2, 3 పోస్టులను పెంచాలన్నారు. గ్రూప్ 1 ప్రిలి మ్స్‌లో 1:100 అభ్యర్థులను ఎంపిక చేయా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.