calender_icon.png 29 March, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరీకి మెగా ఛాన్స్?

18-03-2025 12:00:00 AM

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కోసం 90 రోజుల కాల్‌షీట్స్ సైతం ఇచ్చేశారు మెగాస్టార్. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మాదిరిగానే కంప్లీట్ ఫ్యామిలీ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు అనిల్ రావిపూడి. ‘జై చిరంజీవ’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’, ‘అందరివాడు’ సినిమాల్లో కనిపించిన కామెడీ టైమింగ్‌ను మళ్లీ తెరపై ఆవిష్కరించాలను కుంటున్నాడట.

అయితే ఈ సినిమా కథానాయిక గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన వార్త వినవస్తోంది. ఇందులో చిరు సరసన అదితీ రావు హైదరిని ఎంపి క చేశారట డైరెక్టర్ రావిపూడి. అదితీరావు ఇప్పటివరకు ‘సమ్మోహ నం’, ‘అంతరిక్షం 900 కేఎంపీహెచ్’, ‘వీ’, ‘మహాసము ద్రం’ సినిమాల్లో నటించింది. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మహాసముద్రం’ చిత్రంలో హీరో సిద్ధార్థ్ తో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారి అతన్ని నిరుడు పెళ్లాడిందీ తెలుగందం.

‘సంక్రాంతికి వస్తు న్నాం’ చిత్రం తర్వాత చిరంజీవి పక్కన ఐశ్వర్యరాజేశ్ అయితే బాగుంటుందని అందరూ భావించారు. ఆమె కామెడీ టైమింగ్, చిరు హ్యూమర్‌కు పక్కా సెట్ అవుతుందన్న అభిప్రాయం కూడా వినిపించాయి. అయితే, ఫ్రెష్ పెయిర్ లుక్ కోసం ఐశ్వర్యరాజేశ్‌ను కాకుం డా అదితీరావు హైదరిని హీరోయిన్‌గా సెలక్ట్ చేసుకున్నాడట డైరె క్టర్ అనిల్ రావిపూడి. ఇదంతా నిజ మే అయితే హైదరాబాద్ బ్యూటీ హైదరీ నిజంగా మెగా ఛాన్స్ కొట్టేసినట్టే!