10-02-2025 05:50:53 PM
రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్...
మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన పురస్కరించుకొని ఈ నెల 17న జిల్లా వ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కు లేఖ రాశారు. ఈ నెల 17న కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని జిల్లాలోని తలసేమియా సికిల్ సెల్ రక్త క్షీణిత జబ్బు వారి కొరకు మెగా రక్తదాన శిబిరాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని కోరారు.
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు 800 మంది చిన్నారులున్నారనీ, వీరందరికీ ప్రతి 15 రోజులకు ఒకసారి జీవితాంతము రక్తం అందించాల్సి ఉంటుందనీ వీరంతా మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో వైద్యము పొందుతున్నారన్నారు. వ్యాధి గ్రస్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మెగా రక్తదాన శిబిరం నిర్వహించి వ్యాధిగ్రస్తులకు అండగా ఉండి వారికి ప్రాణబిక్ష పెట్టాలని కోరారు.