14-04-2025 06:15:28 PM
జిల్లా అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్),అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం సోమవారం నిర్వహించారు. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో అంబేద్కర్ జయంతి సందర్భంగా 135 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఆదర్శంగా నిలవడం జరిగిందని కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్ తెలిపారు. రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందజేశారు.
రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మానవతా దృక్పథంతో రక్తదానానికి ముందుకు వచ్చిన రక్త దాతలకు,ఈ శిబిరం విజయవంతం చేయడానికి సహకరించిన డాక్టర్ బాలు,జమీల్ హైమాద్,శివాజీ లకు తలసేమియా పురస్కారాలను అందజేసి సన్మానించారు. ఈ శిబిరంలో పాల్గొని రక్తదాతలను అభినందించడమే కాకుండా రక్తదానం చేసిన ఎంఈఓ రామస్వామి,ఎస్సై వెంకటేశ్వర్లు ఎల్లారెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నిజాం, లను అభినందించారు.
ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ లు మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలోనే ఒక మండలంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా 135 యూనిట్ల రక్తాన్ని ఇప్పటివరకు ఎక్కడ సేకరించడం జరగలేదని అలాంటి గొప్ప సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చి రక్తదానం చేసిన వారందరికీ, జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన అంబేద్కర్ యువజన సంఘాల ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నాలుగు వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించడం జరిగిందని, భారతదేశంలోనే తలసేమియా చిన్నారులకు అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించిన ఘనత కూడా కామారెడ్డి జిల్లాకి దక్కిందని తెలిపారు. కామారెడ్డి జిల్లా రక్తదాతల సమూహం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు తగ్గించుకుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ గౌరవ అధ్యక్షులు డాక్టర్ వేదప్రకాష్, అద్యక్షులు జమీల్,ఉపాధ్యక్షులు వెంకటరమణ, ఎర్రం చంద్రశేఖర్, ఎస్సీ సెల్ ఎల్లారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు గైని శివాజీ, మాజీ సర్పంచ్ సంజీవులు,మాజీ ఏఎంసీ చైర్మన్ శ్యామ్ రావు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య,ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కొంగల వెంకటి, తాడువాయి విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి,సేవాదళ్ సంఘ జిల్లా అధ్యక్షుడు లింగాగౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి,యూత్ సబ్యులు చిరంజీవి, మహిపాల్,సంతోష్,సంజీవులు,సురేష్,రవి,,టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు లింగం,డిటిఎఫ్ అధ్యక్షులు ప్రభాకర్,కార్యదర్శి దేవ్లా జిల్లాలోని వివిధ మండలాల అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.