08-04-2025 04:01:03 PM
మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి యజమాన్యంఆధ్వర్యంలో ఏరియాలోని ఎంవిటీసీ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ(Red Cross Society District Management Committee) సభ్యులు కాసర్ల శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మెగా రక్తదాన శిబిరానికి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ ముఖ్యఅతిథిగా హాజరవు తున్నారని ఆయన తెలిపారు. జిల్లావ్యాప్తంగా 850 మంది తల సేమియా వ్యాధిగ్రస్తులు ఉన్నారని వీరికి ప్రతి 15 రోజులు ఒకేసారి రక్తం అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుతం వేసవి కావడం విద్య సంస్థలకు సెలవులు ప్రకటించడంతో యువకులు రక్తదానానికి నానికి ముందుకు రావడంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సింగరేణి యువ కార్మికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని, సింగరేణి ఆద్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం పట్ల ఆయన వర్షం వ్యక్తం చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు.