calender_icon.png 23 February, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

428 యూనిట్ల రక్తసేకరణ జిల్లా చరిత్రలోనే మొదటిసారి

15-02-2025 11:11:05 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహదారు షబ్బీర్‌ఆలీ

కామారెడ్డి,(విజయక్రాంతి): తలసేమియా పిల్లల కోసం రక్తదాతల సేకరణ కమిటి, షబ్బీర్‌ఆలీ పౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 428 యూనిట్ల  రక్తాన్ని సేకరించడం జిల్లా చరిత్రలోనే మొదటిసారి అని రాష్ట్ర ప్రభుత్వ సలహదారు షబ్బీర్‌ఆలీ అన్నారు. శనివారం రక్తదాతలకు షబ్బీర్‌ఆలీ పౌండేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్‌లను, ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం తన పుట్టిన రోజు సందర్భంగా యువకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. సంత్‌సేవాలాల్ మహరాజ్ పుట్టిన రోజుతో పాటు తన పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు రాష్ట్ర వ్యాప్తంగా 20  వేల మంది ఉన్నారని తెలిపారు.

2023 సంవత్సరంలో 186 యూనిట్లు, 2024లో 336 యూనిట్లు, 225లో 420 యూనిట్ల రక్తాన్ని అందజేయడం  తెలంగాణ రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా ఆదర్శంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం సమన్వయ కర్త డాక్టర్ బాలును ప్రతినిధులు జమీల్, వేదప్రకాష్,ఎర్రం చంద్రశేఖర్,వెంకటరమణ, కుంబాల లక్ష్మణ్‌యాదవ్, గుడుగుల శ్రీనివాస్‌లను షబ్బీర్‌ఆలీ  అభినందించారు. రక్తదానం చేసి వారికి సన్మానించి హెల్మెట్‌తో పాటు ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు వస్తున్న రక్తదాతల సముహ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, భిక్కనూర్ మార్కెట్ కమిటి చైర్మన్ రాజు, మాజీ ఎంపీపీ తోగరి సుదర్శన్, దోమకొండ మాజీ జడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్, కామారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు,సీడీసీ మాజీ చైర్మన్ కారంగుల అశోక్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ  నిమ్మమోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటి డైరెక్టర్లు వలభిషెట్టి లక్ష్మిరాజం, దోమకొండ శ్రీనివాస్,ఇలియాస్, పర్వేజ్, అప్జల్, అన్వర్ హైమాద్, అంజాద్,కోయల్ కర్ కన్నయ్య  తదితరులు పాల్గొన్నారు.