13-02-2025 01:58:30 AM
షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి రక్తదాతకు హెల్మెట్
కామారెడ్డి, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాలు మహమ్మద్ అలీ షబ్బీర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 15 న శనివారం ఉదయం 9 గంటల నుండి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయకర్త బాలు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ బాలు మాట్లాడుతూ మహమ్మద్ అలీ షబ్బీర్ తన జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తాన్ని అందించాలనే మహోన్నతమైన సంకల్పంతో 2023లో 186 యూనిట్లను, 2024లో 336 యూనిట్ల ను సేకరించి అందించడం జరిగిందన్నారు,ఈ సంవత్సరం 500 ల యూనిట్ల రక్తాన్ని సేకరించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకు హెల్మెట్ ను,ప్రశంస పత్రాన్ని అందజేయ నున్నట్లు తెలిపారు. రక్తదానం చేయాలనుకున్నవారు వారి యొక్క వివరాలను 9492874006 కు సంప్రదించాలని అన్నారు. రక్తదాన శిబిరానికి సంబంధించిన కరపత్రాలను,రక్తదానానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలను జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ, పీజీ కళాశాల,స్పూర్తి డిగ్రీ కళాశాల, తెలంగాణ గిరిజన బాలుర డిగ్రీ కళాశాలలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్,ఉపాధ్యక్షులు గంప ప్రసాద్,సభ్యులు అంజల్ రెడ్డి లు పాల్గొన్నారు.