calender_icon.png 5 November, 2024 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌదీ వేదికగా మెగా వేలం

05-11-2024 12:00:00 AM

ఈనెల 24, 25న జరిగే అవకాశం

న్యూఢిల్లీ: ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి గతంలో నిర్వహించిన ముంబై, దుబాయ్ కాకుండా సౌదీ రాజధాని రియా ద్ వేదిక కానుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సోమవారం తెలిపింది. కాగా మెగా వేలం ఈ నెల 24, 25న రెండు రోజుల పాటు జరిగే అవకాశమున్నట్లు బీసీసీఐ వర్గాలు సమాచారం అందించాయి.

దాదాపు ఈ తేదీలే ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  నవంబర్ 22వ తేదీ నుంచి బోర్డర్-గవాస్కర్ టోర్నీ మొదలు కానున్న నేపథ్యంలో వేలం మ్యాచ్ జరిగే రోజు ఉంటుందా? లేకపోతే ఖాళీ రోజులలో నిర్వహిస్తారా అనేది ప్రశ్నగా మారిం ది.

ఈ సంవత్సరం మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ప్రతి జట్టు ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఇచ్చారు. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత 10 జట్ల వద్ద కలిపి రూ. 641.5 కోట్ల నిధులు ఉన్నాయి.

మొత్తం పది ప్రాంచైజీలకు కలిపి 204 మంది ఆటగాళ్లు అవసరం ఉంది. ఆ 204 మందిలో 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. పది ప్రాంచైజీలు కలిపి 46 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుని వారి కోసం రూ. 558.5 కోట్లను ఖర్చు చేశాయి.