calender_icon.png 2 March, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి ఎద్దడి సమస్యలపై జలమండలి అధికారులతో భేటీ

01-03-2025 10:33:28 PM

గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): డివిజన్ లో తీవ్రతరంగా మారిన మంచినీటి సరఫరాలో ప్రెషర్ సమస్య నిర్మూలన కొరకు చర్యలు తీసుకోవాలని శనివారం కార్పొరేటర్ కార్యాలయంలో వాటర్ వర్క్స్ అధికారులతో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రానున్న వేసవి కాలంలో డివిజన్ లో ఎక్కడ మంచినీటి కొరత ఏర్పడకుండా వుండాలని, అలాగే స్థానికంగా డివిజన్ ప్రజలు మంచినీటి సరఫరాలో ప్రెషర్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అందుకు సమస్యను పరిష్కరించడంలో అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇటీవల సమస్య తీవ్రతను జలమండలి ఎండి దృష్టికి తీసుకువెళ్లామని, అందుకు వాటర్ వర్క్స్ అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారని జలమండలి అధికారులను ప్రశ్నించారు. వెంటనే సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని, అలాగే డివిజన్ లో పెండింగ్ లో ఉన్న నూతన పైప్ లైన్ ఏర్పాటు పనులను ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను కార్పొరేటర్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జలమండలి డీజీఎం కార్తీక్ రెడ్డి, మేనేజర్ కృష్ణమోహన్, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ శంకర్ పాల్గొన్నారు.