06-03-2025 12:24:44 AM
కామారెడ్డి, మార్చ్ 5 (విజయక్రాంతి): హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. బాల కిష్టారెడ్డి తో బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి పలు ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను మంజూరు చేయాలని బాల కిష్టారెడ్డి కి విజ్ఞప్తి చేసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకు రాలు జ్యోతి రెడ్డి పాల్గొన్నారు.