calender_icon.png 15 March, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామ పనులపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో భేటీ

15-03-2025 12:29:12 AM

ఖమ్మం, మార్చి 14 విజయక్రాంతి :- సత్తుపల్లి ట్రంక్, సీతారామ ప్రాజెక్ట్ పురోగతి, భూసేకరణ, ఖర్చు, నాణ్యత భవిష్యత్ ప్రణాళికలు అంశాలపై శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరావు హైదరాబాద్ లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు.ప్రస్తుతం సత్తుపల్లి ట్రంక్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, మిగిలిన పనుల పురోగతిని సమీక్షి స్తూ, ప్రాజెక్ట్ నాణ్యత, ఖర్చుల సమీక్ష, పని వేగం తదితర అంశాలను విశ్లేషించారు.

సత్తుపల్లి ట్రంక్ పనులను ఈ సంవత్సరంలోపు పూర్తి చేయాలని ఈ సందర్బంగా సంబంధిత అధికారులను మంత్రులిద్దరూ ఆదేశించారు. పంప్ హౌస్ - 4 నిర్మాణాన్ని కూడా ఈ ఏడాదిలో పూర్తి చేయాలన్నారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.పని నాణ్యత, ఖర్చు నియంత్రణ, పనుల సమయపాలనపై అధికారులు, కాంట్రాక్టర్లు ద్రుష్టి పెట్టాలన్నారు.

 సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణం 

రాబోయే మూడు సంవత్సరాలలో సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తుమ్మల తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గోదావరి జలాలతో సస్య శ్యామలం చేసే సీతారామ ప్రాజెక్ట్ రానున్న రోజుల్లో కీలకం కానుందనీ మంత్రి తుమ్మల స్పష్టం చేసారు.

భవిష్యత్ లో కృష్ణా జలాలు ఇబ్బందిగా మారితే సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు స్థిరీకరణ కు సీతారామ ప్రాజెక్ట్ జీవధార గా నిలుస్తుందని, జూలూరు పాడు టన్నెల్ పూర్తయితే పాలేరు రిజర్వాయర్ కు గోదావరి నీళ్ళు చేరితే భవిష్యత్ లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సీతారామ వర ప్రదాయని గా మారుతుందని మంత్రి తుమ్మల, ఉత్తమ్ కు వివరించారు. ఇరువురు మంత్రులు దీర్ఘ కాలిక ప్రయోజనాల కోసం రైతాంగం మేలు కోసం సాగు నీటికి బాటలు వేసే పనులు పై కీలక విషయాలుచర్చించినట్లు మంత్రులు తుమ్మల ఉత్తమ్ తెలిపారు..