05-03-2025 01:18:57 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 4 (విజయక్రాంతి): ఏప్రిల్ 5న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిలను పురస్కరించుకొని బుధవారం కులసంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్సీ వెల్ఫేర్ హైదరాబాద్ డీడీ కోటాజీ తెలిపారు. రోడ్ నంబర్ 10 జూబ్లీహిల్స్‌లోని జగ్జీవన్‌రామ్ భవన్‌లో నేడు మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి కుల సంఘ ప్రతినిధులు పాల్గొని తమ సందేశాలనివ్వాలని ఆయన కోరారు.