calender_icon.png 5 February, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరబ్ అడ్వోకేట్‌ను కలిసిన

05-02-2025 01:30:10 AM

ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్

జగిత్యాల, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): దుబాయిలోని అరబ్ అడ్వోకేట్ సాద్ మహ్మద్ అల్ మర్జూఖీని ఖనిజాభివద్ధి సంస్థ చైర్మన్, గల్ఫ్ కార్మిక నాయకులు మంగళవారం కలిసారు. యూఏఈ దేశం దుబాయి లోని ప్రముఖ లీగల్ కన్సల్టింగ్ సంస్థ ‘మహ్మద్ సల్మాన్ అండ్ లీగల్ కన్సల్టెంట్స్’ సంస్థను మాజీ ఎమ్మెల్యే, ఖనిజాభివద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ సందర్శించారు.

అరబ్ అడ్వోకేట్ సాద్ మహ్మద్ అల్ మర్జూఖీ, భారతీయ న్యాయవాదులు బిందు ఎస్ చెట్టూర్, అశ్విన్ చతుర్వేదిలతో గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయపరమైన అంశాలు, పరిష్కారాల గురించి చర్చించారు.హొ2010లో షార్జాలో 17 మంది భారతీయులను ఉరిశిక్ష నుంచి తప్పించడంలో బిందు కీలకంగా వ్యవహరించడం గమనారహం. అనిల్ వెంట గల్ఫ్ కార్మిక సమాఖ్య నాయకులు నంగి దేవేందర్’రెడ్డి, మంద భీంరెడ్డి, సుతారి సత్యం, పబ్బ భూమేష్ తదితరులున్నారు.