calender_icon.png 6 March, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరామనవమి, పట్టాభిషేకం ఏర్పాట్లపై నేడు సమావేశం

06-03-2025 12:51:14 AM

కలెక్టర్ జితేష్ పాటిల్ 

భద్రాద్రి కొత్తగూడెం మార్చ్ 5 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏప్రిల్ 6, 7 తేదీలలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం,  పట్టాభిషేకం వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై ఈనెల 6 తేదీ ఉదయం 11 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారుల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని  జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం, పట్టాభిషేకంనకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు కళ్యాణం తిలకించడానికి వస్తారని, వారికి అన్ని రకాల వసతి సౌక ర్యాలు కల్పించడానికి సమగ్ర సమాచారము తో సంబంధిత జిల్లా అధికారులు ఈ యొక్క సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.