కరీంనగర్, జనవరి11(విజయక్రాంతి): కరీంనగర్ -ఆదిలాబాద్-నిజమాబాద్ -మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు .. ఉద్యోగ నిరుద్యోగ సమస్యలపై అవగాహన ఉన్న తాను ఒక వైపు పట్టబదులను కలుస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రచారంలో నరేందర్ రెడ్డి అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు.
. శనివారం స్థానిక మార్క్ ఫెడ్ మైదానంలో వాకర్స్ తో ముఖాముఖి సమావేశం నిర్వహించి రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు... కరీంనగర్ ను ఉత్తర తెలంగాణలో హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తానని వెల్లడించారు.. పల్లెలన్నీ కనుమరుగు అయిపోయే ప్రమాదం ఉందని యువత బయట దేశాలకు వలస వెళ్తున్నారని..
నిరుద్యోగ యువతను రూపుమాపేందుకు తన వద్ద ప్రత్యేక కార్యాచరణ ఉందని తను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని వెల్లడించారు.. ప్రెసిడెంట్ కల్వకుంట్ల ప్రమోద్ రావు, సెక్రటరీ గిరిధర్, శ్రీధర్ చారీ, మహేష్, అవుదరి శ్రీనివాస్, బీర్ల రాజు, వంగ హరీష్ గౌడ్ తదితరులు ఉన్నారు.