18-04-2025 01:50:43 AM
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి ): భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా ముఖ్య నాయకుల సంఘటన సంరచనా స్థానిక జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఉట్కూర్ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో సంస్థ గత జిల్లా ఎన్నికల అధికారి బిజెపి రాష్ట్ర కార్యదర్శి మొగ జయ సంస్థాగత విషయాలపై చర్చించడం జరిగింది.
సంస్థగతంగా 4 మున్సిపాలిటీలో 7 మండల అధ్యక్షత, కమిటీ లకు గాను 12 మండలాల్లో జిల్లా ఉంటుంది ఇందులో 11 మంది అధ్యక్షులను గతంలోని ప్రకటించడం జరిగింది మిగిలిన 5 మండల అధ్యక్షులు అతి త్వరలో ప్రకటించడం జరుగుతుంది* అదేవిధంగా సంస్థగతంగా ప్రతి మండల కమిటీ 12 మంది జిల్లా పదాధికారులతో మొత్తం 45 మంది సభ్యులతో మొత్తం కమిటీ ఉండాలని కమిటీ నియామక ప్రక్రియ ఉండాలని అన్నారు.
జిల్లా ఎన్నిక సహా అధికారులు శ్రీనివాస్ రెడ్డి, చిక్క కృష్ణ, రాష్ట్ర నాయకులు దాసరి మల్లేష్ పాశం భాస్కర్ పోతంశెట్టి రవీందర్, పడాల శ్రీనివాస్, Cn రెడ్డి, పడమటి జగన్మోహన్ రెడ్డి చందా మహేందర్ గుప్తా, కె. అచ్చయ్య పట్నం శ్రీనివాస్,జన్నంపల్లి శ్యాంసుందర్ రెడ్డి, పొన్నాల చంద్రశేఖర్ రెడ్డి, వైజయంతి,యాదిరెడ్డి,రచ్చ శ్రీనివాస్, కిషన్ నాయక్, డి ఎల్ ఎన్ గౌడ్, పట్నం కపిల్ తదితరులు పాల్గొన్నారు