* సంస్థాగత ఎన్నికలు, కాంగ్రెస్ సర్కారుపై పోరుపై చర్చ
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాం తి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర ఇంచార్జి సునీల్ బన్స ల్ సహా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ఆదివా రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
సంస్థాగత ఎన్నికలను త్వరగా పూర్తి చేయడంతోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.ప్రజలకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు, హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకుపో వాలని సునీల్ బన్సల్ సూచించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎంగ ట్టాల్సి ఉందన్నారు.