హైదరాబాద్ : రెండు రాష్ట్రాల మధ్య విభజన పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిలు ప్రజాభవన్ లో భేటీ అయ్యారు. ప్రజాభవన్ కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
తెలంగాణ నుంచి ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రలు అనగాని, కందుల దుర్గేష్, జనార్ధన్ రెడ్డి, ఏపీ సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.