తెలుగు చిత్ర సీమలోని పలువురు ప్రముఖ నిర్మాతలు మంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు సమాయాత్తమవుతున్నారు. విజయ వాడలో సోమవారం నాడు జరుగనున్న ఈ సమావేశంలో టికెట్ల పెంపుతో పాటు ప్రస్తుతం చిత్రసీమ ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయనతో చర్చించనున్నారు. అగ్ర నిర్మాతలైన అశ్వినీదత్, దిల్‌రాజు, నాగవంశీ, డీవీవీ దానయ్య సహా మరికొందరు నిర్మాతలు పవన్‌తో భేటీ కానున్నట్టు సమాచారం.
పవన్ నిర్ణయమే ఆలస్యం!
ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పవన్ సినిమాలు పూర్తి చేయనున్నారని అంతా భావించారు. అందులో భాగంగా ‘హరి హర వీర మల్లు’ సినిమా పనులు ముందుగా పూర్తికానున్నట్టు ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి. కాగా చిత్ర సమర్పకులైన ఏఎం రత్నం తాజాగా దీనిపై స్పందిస్తూ “కొత్త ప్రభుత్వం ఏర్పాటయినందున పవన్ ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, ఆయన సమయానుకూలతను బట్టి ఎప్పుడంటే అప్పుడు తాము సినిమాని ఆరంభించటానికి సిద్ధంగా ఉన్నట్టు” చెప్పుకొచ్చారు.