calender_icon.png 24 October, 2024 | 5:05 AM

రైల్వే అభివృద్ధి పనులపై ఎంపీల భేటీ

24-10-2024 12:18:59 AM

నేడు దక్షిణ మధ్య రైల్వే జీఎంతో సమావేశం 

హైదరాబాద్, అక్టోబర్ 23(విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అభివృద్ధి పనులపై ఎంపీలు నేడు సికింద్రాబాద్ రైల్ నిల యంలో ఏర్పాటు చేసే సమావేశానికి హాజరుకానున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండే తెలంగాణతో పాటు కర్ణాటకకు చెందిన ఎంపీలు సైతం ఈ సమావేశానికి హాజరవుతారు.

2024 రైల్వే బడ్జెట్‌కు ఇప్పటి నుంచే ప్రతిపాదనలు సిద్ధం చేయనున్న నేపథ్యంలో ఎంపీలు తమ నియోజకవర్గాల పరి ధిలోని ప్రధాన రైల్వే సమస్యలను ఈ సమావేశంలో ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ దృష్టికి తీసుకురానున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ రైల్వే డివిజన్ల పరిధిలోని ఎంపీలంతా ఈ సమావేశానికి హాజరవుతారని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

ప్రధానంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై ఎంపీలు ప్రస్తావించే అవకాశం ఉంది. దీంతో పాటు మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయడం, మహబూబ్‌నగర్  డోన్ డబ్లింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరనున్నారు. ఆదిలాబాద్  నిర్మల్  పటాన్‌చెరు కొత్త రైల్వే మార్గంపైనా ఎంపీలు రైల్వే అధికారుల దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉంది.

డోర్నకల్  సూర్యాపేట  కల్వకుర్తి  గద్వాల రైల్వేలైన్‌కు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిన నేపథ్యంలో ఆ పరిధిలోని ఎంపీలం తా ఈ లైన్ కోసం తమ వాయిస్ వినిపించనున్నారు. చర్లపల్లి టెర్మినల్‌కు ఎంఎంటీఎస్ రైళ్లను పెంచే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.