calender_icon.png 20 March, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం

19-03-2025 11:12:10 PM

మోతె: రేపు సూర్యాపేట జిల్లాలో నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారని టిఆర్ఎస్ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరావు అన్నారు. బుధవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ... ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని ఎండగడుతూ బిఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఏప్రిల్ 27న వరంగల్ లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఈ నెల 20న సూర్యాపేట జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే సన్నాహక సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం మోతె మండలం నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని, ఈ సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని అన్నారు.