calender_icon.png 23 November, 2024 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమావేశం

26-09-2024 03:07:06 AM

పన్నుల వసూళ్లతో పాటు కీలక అంశాలపై చర్చ

హైదరాబాద్, సెప్టెంబర్ 25(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని కేం ద్ర జీఎస్టీ కార్యాలయంలో బుధవా రం కేంద్ర, రాష్ట్ర వాణిజ్య పన్నుల అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇరు విభాగాల అ ధికారులు కీలక అంశాలపై చర్చించారు. గత మూడు నెలల్లో రాష్ట్రం లో వసూలైన జీఎస్టీ వసూళ్లపై చర్చి ంచారు.

రాష్ట్రంలోని జీఎస్టీ చెల్లింపుదారుల్లో కొందరు రాష్ట్ర పరిధిలోకి రాగా, మరికొందరు కేంద్ర జీఎస్టీ ప రిధిలోకి వస్తారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జీఎస్టీ చెల్లింపులు ఎలా ఉన్నాయి? రిజిస్ట్రేషన్ల సంఖ్యకు, వ సూళ్ల మధ్య తేడాలు ఉన్నాయా? కేంద్ర పరిధిలో ఉన్నవారు రాష్ట్రం లో..

స్టేట్‌లో ఉన్న వారికి సెంట్రల్ లో ఏమైనా డబుల్ రిజిస్ట్రేషన్లు ఉ న్నాయా? మొత్తం ఇన్‌వాయిస్‌లతో లావాదేవీలు ట్యాలీ అయ్యాయా? ఇలాంటి అనేక విషయాలపై ఇరువర్గాల అధికారులు చర్చించినట్లు తెలిసింది.