calender_icon.png 3 February, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ పార్టీ నాయకుల పరామర్శ..

03-02-2025 07:23:16 PM

పాలకుర్తి (విజయక్రాంతి): రాయపర్తి మండలం(Rayaparthi Mandal) పన్యానాయక్ తండ గ్రామంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాలోత్ సాలమ్మా అనారోగ్యంతో మరణించగా సోమవారం వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు(BRS Party Incharge Errabelli Dayakar Rao) ఆదేశాల మేరకు 50 కేజీల బియ్యం, ఆయిల్ క్యాన్ ను SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాస్ రెడ్డి సహాయంతో వారి కుటుంబానికి అందజేశారు. 

ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ అధికార ప్రతినిధి తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, మండల పార్టీ నాయకులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, లేతకుల రంగా రెడ్డి, గ్రామ తాజా మాజీ సర్పంచ్ వెంకట్రాం, SRR ఫౌండేషన్ ప్రతినిధులు, BRS పార్టీ నాయకులు నాగపూరి సోమన్న, వీరన్న నాయక్, గజవెల్లి ప్రసాద్, కోలా సంపత్, ఎల్లస్వామి, భూక్య రవి, వసంత, ఎండీ యూసఫ్, శ్రీనివాస్, నూనవత్ శంకర్, అంగోత్ అనిల్, భూక్య సురేందర్, అంగోత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.