కరీంనగర్, జూలై 5 (విజయక్రాంతి): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు స్కీంలు, సబ్సిడీలు, గ్రాంట్లు, ఇంట్రెస్ట్ ప్రీ లోన్లు సాధించేందుకు పారిశ్రామికవేత్తలతో శుక్రవారం కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిర్పూర్ వస్త్ర పరిశ్రమను త్వరలో పారిశ్రామికవేత్తలతో సందర్శించనున్నట్లు తెలిపారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలవనున్నట్లు తెలిపారు. మిల్లుల ఆధునీకరణ, ప్రింటింగ్, డయింగ్ మెషనరీల పరికరా లు సమకూర్చునే అంశంపై చర్చిస్తామన్నారు.