calender_icon.png 28 March, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీనాక్షి నటరాజన్ పర్యటన జయప్రదం చేయాలి

21-03-2025 01:34:07 AM

పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి20( విజయ క్రాంతి): లింగాపూర్ మండలం చోర్ పల్లి గ్రామంలో ఈనెల 22,23 తేదీల్లో ఇందిరా ఫెల్లోషిప్ తెలంగాణ రాష్ట్ర బూట్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని శక్తి అభియాన్,ఇందిరా ఫెల్లోషిప్ ఆదిలాబాద్ లోక్ సభ కోఆర్డినేటర్, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్  ఆత్రం సుగుణక్క తెలిపారు.

గురువారం జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుగుణక్క మాట్లాడారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క హాజరు అవుతారని తెలిపారు.

వారి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జ్ఞాపకార్థం, రాజకీయాలు మరియు పాలనతో సహా ప్రతి రంగంలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించడానికి భారత జాతీయ కాంగ్రెస్ ఇందిరా ఫెలోషిప్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావడం, ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేయడానికి వీలుగా నాయకత్వ లక్షణాల కోసం శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.  మహిళా సాధికారత కోసం మహిళలందరూ ఇందిరా ఫెల్లోషిప్ లో చేరాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఇందిరా పెల్లోషిప్ సభ్యులు దుర్గం కళావతి, యశోద, ఇందిరా,ప్రతిభ,విజయ,రాజేశ్వరి, పద్మ,,శంకరమ్మ, రేణుక,కాంగ్రెస్ పార్టీ నాయకులు పెందూర్ సుధాకర్, ఆత్రం భీమ్రావు, గుండా శ్యామ్,సిడాం తిరుపతి,టెకం గంగారం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.