27-02-2025 02:35:36 AM
పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తొలిసారి రాష్ట్రానికి రానున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ నెల 28న గాంధీభవన్‌లో జరిగే టీపీసీసీ విస్తృతస్థాయి సమా వేశానికి ఆమె హాజరవుతారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఈ మీటింగ్‌కు హాజరుకానున్నారు.
దీపాదాస్ మున్షీ స్థానంలో కొత్తగా ఇన్‌చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్‌కు స్వాగతం పలికేందుకు పార్టీ వర్గాలు సిద్ధమయ్యాయి. అయితే ఎలాంటి స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, హంగు ఆర్భాటాలు చేయొద్దని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు స్పష్టం చేశారు. బోకెలు, శాలువలు కూడా తీసుకురావొద్దంటూ ఆదేశాలి చ్చారు.
పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో పాటు త్వరలో ఖాళీ కానున్న ఐదు ఎమ్మెల్సీలతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు.