calender_icon.png 15 February, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌చార్జ్‌గా మీనాక్షి నటరాజన్

15-02-2025 01:04:05 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి) : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌చార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ను అధిష్ఠానం నియమించింది. ఇప్ప టివరకు ఇన్‌చార్జ్‌గా ఉన్న దీపాదాస్ మున్షీ స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెంది న మీనాక్షి పేరును ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీచేశారు.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా 2023 డిసెంబర్ 23న దీపాదాస్ బాధ్యతలు చేపట్టారు. 13 నెలల 12రోజుల పాటు ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇన్‌చార్జ్‌గా ఆమె చివరి కార్యక్రమం. మీనాక్షి నటరాజన్ ఉజ్జయినిలోని బిర్లాగ్రామ్ నాగ్డాలో 1973లో జన్మించారు.

ఇండోర్‌లో న్యాయశాస్త్రంలో డిగ్రీని పూర్తిచేసిన మీనాక్షి.. ఎన్‌ఎస్‌యూఐ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1999- 2002 మధ్య ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2002-2005 మధ్య.. మధ్యప్రదేశ్ యువజన కాంగ్రె స్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 2008లో ఏఐసీసీ కార్యదర్శిగా నియామితులయ్యారు.

2009-14 మధ్య కాలంలో ఎంపీలోని మంద్‌సౌర్ ఎం పీగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ టీమ్‌లో కీలక సభ్యురాలిగా ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, హర్యా నా, మధ్యప్రదేశ్, తమిళనాడు, పుదిచ్చేరి. ఒరిస్సా, జార్ఖండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, బీహార్‌లకు కూడా కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించింది.