calender_icon.png 1 March, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరాడంబరానికి నిర్వచనం మీనాక్షి !

01-03-2025 12:42:11 AM

  1. రైలులో హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్
  2. తన బ్యాగులను తనే మోసుకుంటూ ప్రయాణం
  3. గాంధీభవన్‌లో ఫ్లెక్సీలకు సైతం నో..

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): హంగూ ఆర్భాటాలు లేవు.. స్వాగత తోరణాలు లేవు.. సాధారణ రైలుతో ప్రయా ణం.. తన బ్యాగులు తనే మోసుకుంటూ ప్రయాణం.. ఒక సాధారణ మహిళలా ఆహా ర్యం.. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా..? కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ గురించి. ఒక పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి అంటే ఫస్ట్ క్లాస్ ఫ్లుటైలో అనుకున్న చోటికి చేరుకోవచ్చు. కానీ.. ఆమె కాదు.

శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరగాల్సిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం కోసం ఆమె ఒక సాధారణ మహిళలా రైలులో ప్రయాణించి హైదరాబాద్‌కు చేరుకున్నారు.  తన వెంట తెచ్చుకున్న రెండు బ్యాగు లను కూడా ఆమె మోసుకుంటూ వచ్చి కారు లో కూర్చున్నారు. ఆమె తలుచుకుంటే లగ్జరీ హోటల్‌లో ఉండొచ్చు.

కానీ.. ఆమె సరాసరి ప్రభుత్వ అతిథి గృహంలోనే ఉన్నారు. తన కోసం గాంధీభవన్‌తో పాటు ఎక్కడా కూడా ఒక్క ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయొద్దని పార్టీ శ్రేణులకు ముందే ఆదేశాలివ్వడం గమనార్హం. అప్పటికీ అక్కడక్కడా కొన్ని స్వాగత ఫ్లెక్సీలు కనిపించడంతో ఆమె పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మొత్తానికి ఆమెను నిరాండబరానికి నిర్వచనంగా చెప్పవచ్చు.

స్వాగతం పలికిన సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులు.. 

కాచిగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న మీనాక్షి నటరాజన్‌కు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఇతర కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. దిల్‌కుషా అతిథి గృహంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తదితరులు స్వాగతం పలికారు. 

అధిష్ఠానానికి విశ్వసనీయురాలు..

మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఒక సాధారణ కుటుంబంలో జన్మిం చారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎన్‌ఎస్‌యూఐలో కీలక నాయకురాలిగా సేవలం దించారు. జీవితాంతం ప్రజల సేవలో ఉండాలని, అందుకు పిల్లలు అడ్డుకాకూడదని ఆమె పెళ్లి కూడా చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె హుల్‌గాంధీ కోర్ కమిటీలో సభ్యురాలు. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వసనీయురాలు.