calender_icon.png 4 March, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌ను మార్చేందుకే మీనాక్షి రాక

04-03-2025 01:25:42 AM

  1. డిసెంబర్‌లోపు సీఎం మార్పు ఖాయం
  2. సీఎం సీటుపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి కన్ను
  3. మీడియా చిట్‌చాట్‌లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌ను మార్చేందుకే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ బృందం నుంచి మీనాక్షి నటరాజన్ తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా రంగంలోకి దిగారని, ఇన్‌చార్జ్ మారిన తరుణంలో ఇక మారబోయేది ముఖ్యమంత్రే నని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి జోస్యం చెప్పారు.

డిసెంబర్‌లోపు మరొకరు సీఎం కానున్నారన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో సోమవారం ఆయన మీడియా తో చిట్‌చాట్ నిర్వహించారు. మంత్రివర్గం మధ్య కలహాలు తారస్థాయిలో ఉన్నాయని, మంత్రుల మధ్య నాలుగు స్తంభాలాట నడుస్తుందన్నారు. మంత్రులందరూ ఎవరికి వారే యమునా తీరే.. అన్నట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

సీఎం ను కనీసం ఒక్క మంత్రైనా ఖాతరు చేయడం లేదని ఎద్దేవా చేశారు. కొందరు మంత్రులు ఇప్పటికే సీఎం సీటుపైన కన్నేశారని, వారం తా కావాలనే పనిచేయకుండా ఉంటున్నారని ఆరోపించారు. మంత్రులు పని చేయనీ యడంలేదని పార్టీ పెద్దలకు చెప్పిన ఒకే ఒక సీఎం రేవంత్‌రెడ్డి మాత్రమేనన్నారు.

ఇప్పటికే సీఎం సీటుపై డిప్యూటీ సీఎం భట్టివిక్ర మార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కన్ను ఉందన్నారు. ఆ ముగ్గురూ సీఎంకు సహకరించడం లేదన్నారు. ఎస్‌ఎల్బీసీ ప్రమాదం జరిగిన ఎనిమిది రోజుల వరకూ సీఎంను ప్రమాద స్థలి కి రానీయకపోవడమే అందుకు నిదర్శనమని వ్యాఖ్యా నించారు. 

సీఎంకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నా రని, ఇక్కడి అంశాలను ఢిల్లీకి చెరవేస్తున్నారని ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయ ని అన్నారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మార్పులోనూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హస్తం ఉందని అంచనా వేశా రు.

సీఎం రేవంత్ గత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీకి నజరానాలు ఇచ్చి నెట్టుకువచ్చారని, మీనాక్షి రంగంలోకి దిగాక సీఎంకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఎద్దేవా చేశారు. భట్టి, ఉత్తమ్, పొంగులేటి నిర్వహిస్తున్న శాఖల్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపిం చారు.

దేశంలో గానీ, మొత్తం రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా పొంగులేటి ట్యాక్స్ వసూలవుతున్నదని, ఆ పర్సంటేజీ 50 శా తం వరకు వెళ్లిందని ఆ పార్టీ వర్గాలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నాయన్నారు. సీ ఎం ప్రమేయం లేకుండానే అందులో కొంత ఢిల్లీ పెద్దలకు వెళ్తుందని ఆరోపించారు.